మెగాస్టార్ చిరంజీవి బి గోపాల్ కాంబినేషన్ లో 2002 లో వచ్చిన సినిమా ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో చిరు ఎనర్జీ, డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నీ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. మెగా ఫ్యాన్స్ కి బాగా ఇష్టమైన చిరు సినిమాల్లో ఒకటైన ఇంద్ర ఇప్పటికీ టీవీల్లో వచ్చినా తెగ చూసేస్తుంటారు. ఐతే ఈమధ్య స్టార్ హీరోల ఒకప్పటి సినిమాలను వారి బర్త్ డే రోజు రిలీజ్ చేస్తున్నరు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి కూడా ఇంద్ర సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంద్ర సినిమా 4కె ప్రింట్ చిరు బర్త్ డే రోజు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఆ రోజు ఇంద్ర ఎంపిక చేసిన కొన్ని సెంటర్స్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఇంద్ర సినిమా రీ రిలీజ్ అంటే ఆ సినిమాను మళ్లీ థియేటర్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే.

ఈ సినిమాలో సోనాలి బింద్రె.. ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. మరి స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ కలెక్షన్స్ తో కూడా రికార్డులు కొడుతున్న ఈ టైం లో ఒకప్పటి సూపర్ హిట్ సినిమా ఇంద్ర రీ రిలీజ్ కు ఏ రేంజ్ వసూళ్లు వస్తాయన్నది చూడాలి. ఇంద్ర సినిమాకు కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యువ హీరోలకు కూడా ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. చిరు బర్త్ డేని మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: