అదంతా ఒక ఎత్తు అయితే... ఇక్కడ కథానాయకుల ఫాలోయింగ్ అనేది మరో ఎత్తు. ఇక్కడ కేవలం ఫ్యాన్ బేస్డ్ సినిమాలు నడుస్తాయి అనేది నిర్వివాదాంశం. ఇక్కడ అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలు కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి. సినిమా విడుదలైన ఆ రెండు మూడు రోజుల ఓపెనింగ్స్ అనేవి సినిమా బిజినెస్ ని నిర్దేశిస్తాయి. ఈ క్రమంలోనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. అయితే ఆ సమయం రానే వచ్చింది... ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ఎవరో తాజా సర్వేలో తేలిపోయింది. అందరూ హీరోలను తలదన్నుతూ... డార్లింగ్ ప్రభాస్ ముందంజలో ఉన్నాడు.
ఇక ప్రభాస్ గురించి ఇక్కడ చెప్పేదేముంది? బాహుబలి సినిమా తోనే అతని రికార్డులకు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. అలా దాదాపుగా ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను కలుపుకుంటే... ప్రభాస్ దాదాపుగా పదివేల కోట్ల మేర బాక్సాఫీస్ బిజినెస్ ని కొల్లగొట్టాడని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ ఖాన్స్ సైతం ఈ రేసులో వెనకబడినట్టు సమాచారం.. ఇక మన హీరోల సంగతి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాస్ హీరోలుగా చలామణి అవుతున్న ఓ నలుగురు ఐదుగురు హీరోలను సైతం ప్రభాస్ వెనక్కి నెట్టి... ప్రస్తుతం బాక్సాఫీస్ రారాజుగా వెలుగొందుతున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.