మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీ “ఇంద్ర”.. అప్పటి వరకు చిరంజీవికి ఎంతటి మాస్ ఇమేజ్ వున్నా కూడా  ఫ్యాక్షన్ సినిమాలు సెట్ కావు అన్నవారు ముక్కు మీద వేలేసుకునేలా చేసింది ఇంద్ర సినిమా..చిరంజీవికి మాస్ కామెడీ సినిమాలు మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమా తో మెగాస్టార్ మూయించాడు. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా  చిన్ని కృష్ణ ఈ సినిమాకు కథను అందించాడు.2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే దాదాపు  రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది.చిరంజీవి కెరీర్‌లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర సినిమాకు వచ్చాయి.ఇంద్ర సినిమా విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం కనిపించింది.

ఈ సినిమాకు ఆ రోజుల్లోనే వేలకు వేలు పెట్టి బ్లాక్‌ లో టికెట్స్ కొనుక్కుని మరి ఈ సినిమా చూశారంటే ఇంద్ర సినిమా ప్రేక్షకులను ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే షౌకత్ అలీఖాన్, మొక్కే కదా అని పీకేస్తే అనే డైలాగ్స్ ఊర మాస్ అని చెప్పొచ్చు.అయితే ఈ సినిమా విడుదలై నేటికి 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాలో మెగా స్టార్ సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు..విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ కీలక పాత్రలో నటించాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర షూటింగ్ లో బిజీ గా వున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: