తన పైన ఫేక్ వార్తలను రాసి ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదంటూ తెలియజేసింది. దిశా ఘటన సమయంలో పూనమ్ కౌర్ చేసిన ఒక వార్తను సైతం ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో ప్రచురించారంటూ తెలియజేసింది. ఇందులో దిశాకు న్యాయం చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు థాంక్స్ చెబుతూ ఇలాగే నాతో పాటు పలువురు మహిళలను కూడా మోసం చేసిన కొంతమంది సినిమా రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను అంటూ.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అంటూ ఆంధ్ర జ్యోతి ప్రచురించింది..
అయితే ఈ పోస్ట్ చేసింది తాను కాదని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ నాపైన మరో ఫేక్ న్యూస్ దీనిపైన ఆంధ్రజ్యోతి ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణలు చెప్పడం లేదు కదా అంటూ కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదని.. అలాగే ఒకరి అజెండాలను మరొకరు భుజం మీద రుద్దడం సరికాదు అంటూ తెలియజేసింది.. వీళ్లు స్పందిస్తారని నేను అనుకోను.. కానీ నేను ప్రజలను నమ్మవద్దని నేను గుర్తు చేస్తున్నానని తెలిపింది. అలాగే వాళ్ళు నన్ను ఇప్పటివరకు వెంటాడుతూనే ఉన్నారంటూ రాసుకుంది పూనమ్ కౌర్.. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసినటువంటి ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.