నిర్మాతలు ఈ సినిమాను 70 కోట్లలో పూర్తి చేయాలని అది కూడా రెమ్యునరేషన్స్ తో కలుపుకుని అని చెప్పగా అది కాస్త చిన్నగా 90 కోట్లు అయ్యిందట. ఐతే రవితేజ సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతుంది. హిందీ రైట్స్ ఒక పాతిక, ఓటీటీ ఒక 20 కోట్ల దాకా బిజినెస్ కాగా థియేట్రికల్ రైట్స్ ఒక 30 కోట్లకు అటు ఇటుగా జరిగిందట. శాటిలైట్ ఒక ఐదారు కోట్లు వస్తుందని టాక్.
మొత్తం బిజినెస్ 80 కోట్లు కాగా ఇంకా 10 కోట్లు డెఫిషీట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాను ముందు అనుకున్న విధంగా 70 కోట్లలో పూర్తి చేసుంటే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా 10 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. హరీష్ శంకర్ ఎలాగు కమర్షియల్ సినిమాలను సూపర్ హిట్లుగా మలిచేస్తాడు కాబట్టి రవితేజ కు ఒక సాలిడ్ హిట్ ఇస్తాడని మాస్ రాజా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఆగష్టు 15న పోటీగా డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. మరి మాస్ రాజా, ఎనర్జిటిక్ స్టార్ మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. రవితేజ మిస్టర్ బచ్చన్ టీం మాత్రం సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు.