కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార జవాన్ తర్వాత ఆమె కూడా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. షారుఖ్ తో జవాన్ సినిమాలో నటించి మెప్పించిన నయనతారసినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అక్కడ నుంచి క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. ఐతే తన సొంత భాషలోనే సినిమాలు చేయాలని చూస్తున్న అమ్మడు హిందీ నుంచి ఆఫర్లను తిరస్కరిస్తుందని తెలుస్తుంది.

ఐతే ఇప్పటికే నయన్ తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా మరో సినిమాను ఓకే చేసిందట. ఈసారి కొత్త హీరోతో జత కడుతుందట నయనతార. స్టార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కవిన్ రాజ్ తో నయనతార ఒక లవ్ స్టోరీ చేస్తుందని తెలుస్తుంది. లోకేష్ కనరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విష్ణు ఎడవన్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

సినిమా కథ అమ్మాయికి ఏజ్ ఎక్కువ.. అబ్బాయికి ఏజ్ తక్కువ.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఐతే ఇలాంటి ఏజ్ గ్యాప్ కథలు చాలానే వచ్చినా మరి నయన్, కవిన్ రాజ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. మరి స్టార్ హీరో కవిన్ రాజ్ నయన్ తో చేసే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నయనతార ఓ పక్క ఫిమేల్ లీడ్ సినిమాలు చేస్తూ మరోపక్క ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంది. మొత్తానికి నయనతార చాలా కాలం తర్వాత ఒక లవ్ స్టోరీలో నటిస్తుంది. అమ్మడు టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో నయనతారకు అప్పట్లో ఆఫర్లు వచ్చినా కాదనేసరికి తెలుగు మేకర్స్ ఆమె మీద కోపం పెంచుకున్నారు. అందుకే ఈమధ్య టాలీవుడ్ నుంచి నయనతార దగ్గరకు ఒక్క ఆఫర్ కూడా వెళ్లలేదని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: