‘నిన్నేపెళ్ళాడతా’ ఖడ్గం’ ‘మురారి’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ నేటితరం ప్రేక్షకుల అభిరుచులను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. దీనికి కారణాలు అనేకం. ప్రస్తుతం సినిమాలులేక ఖాళీగా ఉన్న కృష్ణవంశీ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటున్నాడు.



తరుచూ చాట్ చేస్తూ ఒకనాటి తన అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు చాల ఓపిగ్గా సమాధానం ఇస్తున్నాడు. ఒకప్పుడు చాల ఆవేశంగా ఉండే కృష్ణవంశీ ఇప్పుడు చాల సహనంతో సమాధానాలు ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఛాట్ అలనాటి సినిమాల గురించి అప్పటి పరిస్థితుల గురించి ఈనాటి తరం వారికి తెలిసేలా సమాధానాలు ఇస్తున్నాడు.



ఈ క్రమంలో భాగంగా ఒక నెటిజన్ ‘రంగమార్తాండ’ సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ ఈనాటి సమాజానికి అలాంటి సినిమాలు చాల అవసరం అనీ అలాంటి సినిమాలు కొంతమందిలో అయినా మార్పు తీసుకువస్తాయని అభిప్రాయపడుతూ అలాంటి సినిమాలను ఇంకా చాలతీయమని సలహా ఇచ్చాడు. దానికి కృష్ణవంశీ స్పందిస్తూ అది పెద్ద ఫ్లాప్ సార్. థియేటర్లలో ఎవ్వరూ చూడలేదు. నాకు నిర్మాతలకు పెద్ద లాస్. మళ్లీనా.. వొద్దు స్వామీ” అంటూ తనలోని నిరాశను వ్యక్తపరిచాడు.



వాస్తవానికి ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. కృష్ణవంశీలోని దర్శకుడు మళ్ళీ నిద్రలేచాడు అంటూ ‘రంగమార్తాండ’ మూవీకి మంచి రేటింగ్స్ కూడ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడ ధియేటర్లకు రాకపోవడంతో ఆమూవీ భారీ ఫ్లాప్ గా మారింది. ఈ మూవీలో నటించిన బ్రహ్మానందం రమ్యకృష్ణ తమ పాత్రలకు జీవం పోసి నటించినా జనం పట్టించుకోలేదు. మరాఠీ భాషలో విజయవంతం అయి జాతీయ అవార్డు పొందిన ఈమూవీని తెలుగులో రీమేక్ చేస్తే జనం ఎవరు పట్టించుకోలేదు. దీనితో ధైర్యం చేసి మంచి సినిమాలను తీసిన జనం చూడరు అన్న విషయం మరొకసారి రుజువు అవవడంతో నిజంగా మంచి సినిమాలు తీయాలి అని అభిలాష పడే దర్శకులు నిరుత్సాహ పడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: