తమిళ స్టార్ హీరోగా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాయన్. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో శుక్రవారం నాడు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఉన్నాయి అయితే ఉన్నాయనే చెప్పాలి.ఈ మధ్యనే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ ఆల్ రెడీ డీసెంట్ బజ్ ను సొంతం చేసుకోగా తమిళ్ లో సినిమా మీద మంచి క్రేజ్ అనేది ఏర్పడింది. తెలుగు లో ఈ సినిమా మీద పర్వాలేదు అనిపించేలా బజ్  ఉండగా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది.తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ధనుష్ నటించిన ప్రీవియస్ మూవీ కెప్టెన్ మిల్లర్ మొత్తం 44 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు రాయన్ మూవీ కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో బిజినెస్ అయితే జరుపుకుంది.


మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా జరుపుకుంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం  46 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టాలి. అంటే 85 కోట్ల నుంచి 90 కోట్ల రేంజ్ లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టాలి. అలా ఆ రేంజ్ లో వసూళ్ళని అందుకుంటే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. గతంలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ ఆడియన్స్ ని ఎంతగానో నిరాశపరిచాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితాన్ని నమోదు చేయలేకపోయింది. లాంగ్ రన్ లో ప్లాప్ గా మిగిలింది ఈ సినిమా. ఇక ఈ ప్రతిష్టాత్మక 50వ సినిమాతో ధనుష్ ఎలాంటి రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటాడో చూడాలి.ఇక ఈ రాయన్ సినిమాను సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది ధనుష్ 50వ సినిమా కాబట్టి ధనుష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి  నటించాడు. పైగా ఈ మూవీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్ ఇంకా అలాగే కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ మూవీలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: