మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇంద్ర సినిమా అంత త్వరగా ఎవరో మర్చిపోలేరు. ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ సినిమా అంటే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అప్పట్లో విడుదలైన ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరోపక్క త్వరలోనే చిరంజీవి పుట్టినరోజు కూడా

 రాబోతుంది. ఇందులో భాగంగానే ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇంద్ర సినిమా విడుదలై నీటికి 22 ఏళ్లు అయిపోతుంది. అయితే ఈ సందర్భంగా ఆగస్ట్‌ 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. వైజయంతీ మూవీస్‌ సంస్థ గోల్డెన్‌జూబ్లీ ఇయర్‌ని సెలబ్రేట్‌ చేస్తూ చిరంజీవి జన్మదినం ఆగస్ట్‌ 22న ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేస్తున్నారు. చిరంజీవితో వైజయంతీ మూవీస్‌ సంస్థ అనేక హిట్‌ చిత్రాలను రూపొందించింది. వాటిలో ‘ఇంద్ర’ మోస్ట్‌ మెమరబుల్‌ మూవీగా

నిలిచిపోయింది. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మూడు నంది అవార్డులతో పాటు రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఒక రాయలసీమ వ్యక్తి అక్కడి ప్రజల కోసం వేల కోట్ల ఆస్తులు వదులుకొని అయిన వారందరిని దూరం చేసుకుని కాశీలో సాధువులా జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటిలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు, ప్రజలు వింటూనే ఉంటారు. అలాంటి సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: