టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. సమంత నటనకి కోటాల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాను నటించిన మొదటి సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలిచింది.

దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన జతకట్టి కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. ప్రస్తుతం సమంత తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. హిందీలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఇక సమంత బాలీవుడ్ లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది.

ఇక తెలుగులో సినిమాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.... సమంత కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సమంత బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. ఇక యాంకర్ మీరు ఆహారం, శృంగారం ఈ రెండింటిలో ఏది లేకుండా ఉండగలరు అని అడిగారు.

దానికి సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఆహారం లేకుండా ఉండగలను.... కానీ శృంగారం లేకుండా అసలు ఉండలేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సమంత చెప్పిన ఆన్సర్ విన్న చాలా మంది నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సమంత చెప్పిన ఆన్సర్ ని చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఇక కొద్ది రోజులకి మర్చిపోయారు. మళ్లీ ఈ మధ్యకాలంలో ఆ పాత వీడియోని మళ్లీ ఇప్పుడు నెగిటివ్ గా ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: