కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన అజిత్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. రజనీకాంత్, కమలహాసన్ తర్వాత అత్యధికంగా ఫ్యాన్స్ కలిగిన రెండవ తరం నటులుగా పేరు పొందారు హీరో అజిత్.. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా అజిత్ కి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. అయితే అజిత్ తన సహనటుల కంటే చాలా విభిన్నంగా ఉంటారు.. ముఖ్యంగా ఇతర హీరోల కంటే తన ప్రపంచం వేరు అనే అంతలా సినిమాలను చేస్తూ తనకి ఇష్టమైన బైక్ రైడింగ్ వంటివి చేస్తూ తన జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హీరో అజిత్.


దేశ విదేశాలలో కూడా ఎన్నోసార్లు బైక్ రైడింగ్ వంటివి చేస్తూ ఉంటారు. అజిత్ స్టార్ హీరో గ్యారేజ్లో అత్యుత్తమైన రేసింగ్ బైక్లు కార్లు కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరొక ఎరుపు రంగు ఫెరారీ కారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీని ధర అక్షరాల రూ .9కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అజిత్ తన కొత్త కారు పక్కన కూర్చొని కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.. వీటిని అజిత్ అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు.


భారతదేశంలో దీని ధర  9 కోట్ల రూపాయలు ఉన్నది.. ఇది ఫెరారీ SF90 మోడల్ కార్ కలిగి ఉన్నది. దీని ఇంజన్ 3990 CC కలిగి ఉన్నది ఈ కార్ కొన్ని సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగానికి సైతం ప్రయాణిస్తుంది అంట. అలాగే సేఫ్టీ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అజిత్ కుమార్ దగ్గర 34 కోట్లు విలువ చేసే లాంబోర్గని కారు కూడా ఉన్నది. వీటితోపాటు కొన్ని కోట్ల విలువైన కార్లు బైకులు కూడా కలవు అజిత్ దగ్గర. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే.. విడ మయూర్చి చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అలాగే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలో కూడా నటిస్తున్నారు అజిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: