దేవర కోసం కొరటాల శివ మరో విలన్ ని కూడా తీసుకుంటున్నారని టాక్. అతనెవరో కాదు యానిమల్ సినిమాతో రచ్చ చేసిన బాబీ డియో అని తెలుస్తుంది. బాలీవుడ్ లో బాబీ డియోల్ ఫాం లో లేని టైం లో యానిమల్ సినిమా అదరగొట్టేసింది. యానిమల్ తో ఆయన తిరిగి ఫాం లోకి రాగా అప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు.
యానిమల్ తర్వాత కంగువ లో ఛాన్స్ అందుకున్న బాబీ డియోల్ బాలయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. విలన్ గా మళ్లీ కెరీర్ గాడిన పడినట్టుగా అనిపిస్తున్న బాబీ డియోల్ కు ఇప్పుడు ఏకంగా దేవర సినిమాలో కూడా ఛాన్స్ రావడం విశేషం. కచ్చితంగా ఎన్ టీ ఆర్ సినిమాలో బాబీ డియోల్ ఉంటే మాత్రం అతనిని మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. దేవర 1 లో సైఫ్, దేవర 2 కోసం బాబీ ఇద్దరు బాలీవుడ్ విలన్లు ఎన్ టీ ఆర్ కోసం పనిచేస్తున్నారు. బాలీవుడ్ శత్రు సైన్యంతో దేవర ఢీ కొడితే బాక్సాఫీస్ లు షేక్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు.