చియాన్ విక్రం హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తంగలాన్. పా రంజిత్ లాంటి విలక్షణ దర్శకుడికి అంతే విలక్షణ నటుడు తోడైతే వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో తంగలాన్ ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న తంగలాన్ సినిమా ఫైనల్ గా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకుంది. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మాళవిక మోహనన్ నటిస్తుంది.

మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన మాళవిక తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఐతే తంగలాన్ సినిమా చాలా డిఫరెంట్ సినిమా. ఈ సినిమా కోసం కాస్ట్ అంతా కూడా ప్రత్యేకమైన మేకప్ వేసుకున్నారు. సినిమాలో వారి విచిత్ర వేషధారణ కోసం ప్రోస్తెటిక్ మేకప్ వేసుకున్నారు. దాదాపు 3, 4 గంటల పాటు ఆ మేకప్ వేసుకోవడానికి టైం పట్టేదట. దాని వల్ల అనవసరమైన స్కిన్ ప్రాబ్లెంస్ వచ్చాయని హీరోయిన్ మాళవిక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది.

అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో ఒకరోజు గేదె మీద ఎక్కి షూటింగ్ లో పాల్గొనాలని డైరెక్టర్ చెప్పాడట. అలా చేయడం తన వల్ల కాదని డైరెక్టర్ తో వాధించిందట మాళవిక. కానీ సినిమాకు అది అవసరం అని చెప్పి మాళవికను గేదెను ఎక్కించారట. ఆ సీన్ చేస్తున్నప్పుడు తనకు ఎంతో భయం వేసిందని చెప్పుకొచ్చింది మాళవిక. ఐతే సినిమా చేసినప్పుడు ఒకలా అనిపించినా ఇప్పుడు ఇలాంటి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నది మాళవిక మోహనన్. ఈ అమ్మడు ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తప్పకుండా అమ్మడు తెలుగులో టాప్ ప్లేస్ కు వెళ్లే ఫీచర్స్ కనిపిస్తున్నాయి.  రాజా సాబ్ సినిమా తర్వాత అమ్మడు వరుస తెలుగు సినిమాలు నటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఒక సినిమా చేయకుండానే మాళవికను తెలుగు ప్రేక్షకులు ప్రమోట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: