బాలకృష్ణ నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఎన్.బి.కె 110 సినిమాగా ఇది వస్తుంది. అఖండ 2 గానే ఈ ప్రాజెక్ట్ రాబోతుందని అంటున్నారు. ఐతే ఈ సినిమా నిర్మాత ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. బాలయ్య అఖండ 2 తర్వాత నెక్స్ట్ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేస్తారని తెలుస్తుంది. బాలకృష్ణ దిల్ రాజు ఈ కాంబో ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఈ కాంబో సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. ఐతే దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ చేసే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రాజు గారు ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. బాలయ్య దిల్ రాజు కాంబో ఒక క్రేజీ సినిమా రాబోతుందని చెప్పొచ్చు. బాలయ్య సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది. మాస్ హీరో ఇమేజ్ ఉన్నా ఈమధ్య బాలకృష్ణ కొత్త కథత్లతో తన మార్క్ చూపిస్తున్నారు. ఐతే దిల్ రాజుతో బాలయ్య చేసే సినిమా ఒక పక్క కమర్షియల్ అంశాలు ఉంటూనే మరోపక్క ఒక మంచి ఎమోషనల్ స్టోరీ తో వస్తున్నారని తెలుస్తుంది. అఖండ 2 తో మరోసారి బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాలని ఫిక్స్ అయిన బాలయ్య బాబు రాబోతున్న సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులే అవ్వడం విశేషం.