ఈ సినిమాలో విక్రం సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా మరో ఇంపార్టెంట్ రోల్ లో పార్వతి తిరువొతు నటించింది. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మిగతా ప్రచార చిరాలన్నీ కూడా అంచనాలు పెంచాయి. విక్రం నట విశ్వరూపం మరోసారి చూపించాడు అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాకు సెన్సార్ టీం షాక్ ఇచ్చింది. సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ కొన్నిచోట్ల బీప్ లు వేసినట్టు తెలుస్తుంది.
అంతేకాదు కొన్ని చోట్ల బ్లర్ వేశారని చెబుతున్నారు. ఈ సినిమాతో విక్రం తిరిగి ఫాం లోకి రావాలని అనుకుంటున్నాడు. కోలీవుడ్ లో అందరు హీరోలు తమ సినిమాలతో రికార్డులు కొడుతుంటే విక్రం ఎందుకో వెనక పడిపోయాడు.. చివరగా కోబ్రా సినిమాతో వచ్చి నిరాశ పరచిన విక్రం మరి తంగలాన్ తో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి. ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తంగలాన్ విక్రం మార్క్ హిట్ అందుకుంటుందా లేదా అన్నది ఆగష్టు 15న తెలుస్తుంది. తంగలాన్ సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే తెలుగులో ఈ సినిమాకు అనుకున్నంత బిజినెస్ జరగలేదని టాక్. అందుకే ఇక్కడ ఇంకా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. అయితే ఆగష్టు 15న తెలుగులో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.