కన్నడ భామ రష్మిక ఇప్పుడు నేషనల్ వైడ్ గా సూఒపర్ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో చేసిన యానిమల్ సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ ఇక్కడ అమ్మడికి అడ్డు లేకుండా అయిపోయింది. ఓ పక్క పాన్ ఇండియా సినిమాల్లో చేస్తూ సత్తా చాటుతున్న రష్మిక మరోపక్క హిందీ సినిమాలతో అలరిస్తుంది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2, కుబేర, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటు ఓ హిందీ సినిమాకు కూడా రీసెంట్ గా సైన్ చేసిందని తెలుస్తుంది.

ఇదిలాఉంటే రష్మిక లేటెస్ట్ గా కేరళలో ఒక ప్రైవేట్ ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. అక్కడ అభిమానుల కోసం స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది. దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాలోని రంజితమే  అనే సాంగ్ కి రష్మిక కాలు కదిపింది. శారీ లోనే కనిపించినా రష్మిక మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఎక్కిస్తున్నాయి. ఐతే కేరళలో ఇలా తమిళ హీరో పాట చేయడం అక్కడ ఫ్యాన్స్ ని అసంతృప్తి పరచింది.

రష్మిక కెరీర్ మొదలు పెట్టింది కన్నడ పరిశ్రమలోనే అయినా ఆమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. ఐతే అక్కడ ఈవెంట్ లో ఫ్యాన్స్ అడగడం వల్లే ఆమె అలా డ్యాన్స్ చేసిందని తెలుస్తుంది. విజయ్ వారిసు సినిమాలో రష్మిక నే హీరోయిన్ గా నటించింది. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే తెలుగులో మాత్రం వారసుడిగా రిలీజైంది కానీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. రష్మిక నటనలోనే కాదు డ్యాన్స్ లో కూడా హీరోలకు సమానంగా వేస్తుంది. అందుకే ఆమె తో డ్యాన్స్ నెంబర్స్ అదిరిపోతుంటాయి. రంజితమే డ్యాన్స్ కి ఆమె వేసిన వీడియోలో కూడా మూమెంట్స్ తో అదరగొట్టింది రష్మిక.





మరింత సమాచారం తెలుసుకోండి: