తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ఏర్పరచుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు తానే దర్శకత్వం వహిస్తూ , తానే హీరోగా నటిస్తూ పలకనామా దాస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఈమేజ్ దక్కింది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఈయన చాలా సినిమాలలో నటించగా అందులో ఒకటి , రెండు తప్పిస్తే అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఆఖరుగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , అంజలి మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రవితేజ మల్లపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రామ్ తాళ్లూరిమూవీ ని నిర్మిస్తున్నాడు. జాక్స్ బీజాయ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మీనాక్షి చౌదరి , శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సంస్థ వారు భారీ ధరకు ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs