ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. అదేంటంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. రామ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ డీల్ ఈ అప్‌కమింగ్ ఫిల్మ్‌కి వచ్చిందని అంటున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఇండియా 33 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని ఇన్సైడ్ టాక్. ఇందులో హీరోయిన్ కావ్య ప్రవీణ్ థాపర్. ఈ మూవీ కోసం పెట్టిన బడ్జెట్లో దాదాపు 30% ఈ రైట్స్ ద్వారానే వచ్చి ఉంటాయని అంటున్నారు.
ఇక థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు కలిసి రూ.60 కోట్లకు దక్కించుకున్నారు. అయితే ఈ రెండు డీల్స్ కూడా రామ్ సినిమా కెరీర్ మొత్తంలో అతి పెద్దవి అని మూవీ టీమ్ వెల్లడించింది. మరి ఈ సినిమా ఈ హక్కుల లాగానే ఎక్కువ కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీ హిట్ అయితే రామ్ మళ్లీ బిజీ అయిపోతాడు.ఇంతకుముందు స్కందా సినిమా వల్ల ఈ హీరో ఓ ఫ్లాప్ చవి చూశాడు. దాని నుంచి బయట పడాలంటే డబుల్ ఇస్మార్ట్ హిట్ అయి తీరాల్సిందే. లేకపోతే కెరీర్ కాపాడుకోవడం కష్టమైపోతుంది.