నాచురల్ స్టార్ నాని చాలా వరకు తక్కువ బడ్జెట్ లో రూపొందే సినిమాలలోనే కెరియర్ ప్రారంభంలో నటిస్తూ వచ్చేవాడు. దారి ద్వారా ఈయన నటించిన సినిమాలో మంచి విజయాలను సాధిస్తే నిర్మాతలకు , ఆ సినిమాలనుకొన్న డిస్ట్రిబ్యూటర్ లకి భారీ మొత్తంలో లాభాలు వస్తూ ఉండేవి. దానితో నాని అంటే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే అలా నాని కి మంచి సినిమాలు రావడం , అవి అద్భుతమైన విజయాలు సాధించడం , వాటి ద్వారా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలు వస్తూ ఉండటంతో ఈయన క్రేజ్ కూడా భారీగా పెరిగింది.

దానితో నాని కూడా కొంత ఎక్కువ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ వచ్చాడు. కానీ అవి కూడా మంచి విజయాలను సాధిస్తూ ఉండడంతో నాని తన  రూట్ ను మార్చినట్లు తెలుస్తోంది. ఇకపై నాని కూడా భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక కొంత కాలం క్రితమే నాని "దసరా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన హాయ్ నాన్న సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశాడు.

మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాలతో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉండడంతో నాని భారీ బడ్జెట్ సినిమాలలో నటించిన పెద్దగా ప్రాబ్లం లేదు అని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. నాని తన తదుపరి మూవీ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీకి దాదాపుగా వంద కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అలాగే నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ మూవీలో కూడా హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా నాని భారీ బడ్జెట్ మూవీలపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ రెండు మూవీల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: