నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక నాని మొదటి నుండి కూడా ఈ సినిమాకు ఏ మూవీ పోటీ లేకుండా పక్కా ప్రణాళికతో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. ఈ మూవీ కి కొత్త సినిమాల ద్వారా పెద్ద ప్రాబ్లం లేదు కానీ రీ రిలీజ్ మూవీల ద్వారా మాత్రం పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా నాగార్జున సినిమాల ద్వారా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సమస్య ఎదురయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు 29 వ తేదీన అనే విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున హీరోగా రూపొందిన శివ మూవీ ని ఆగస్టు 29 వ తేదీనే రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాతోనే పెద్ద ప్రాబ్లం ఉంది దానికి అనుకునే లోపు నాగార్జున హీరోగా రూపొందిన మాస్ మూవీ ని కూడా ఇదే తేదీన రీ రీల్స్ చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది కూడా జరిగితే నాని కి నాగార్జున హీరోగా రూపొందిన శివ , మాస్ మూవీల రీ రిలీజ్ తో పెద్ద ప్రాబ్లం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: