టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో ప్రేక్షకుల ముందుకు రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.2019 వ సంవత్సరంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ మరో మ్యాజిక్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూరితో పాటు రామ్ కు అదిరిపోయే రిజల్ట్ అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు వచ్చిన పాటలు కూడా అదరగొట్టేశాయి.రెండు సాంగ్స్ కూడా మంచి ఛార్ట్ బస్టర్లుగా నిలిచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. త్వరలోనే మూడో పాటను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుందీ సినిమా. దీంతో విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ఇంకా స్పీడ్ గా ప్రమోషన్స్ చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లు రామ్ కెరీర్ లోనే రికార్డ్ రేంజ్ లో జరిగాయి.ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ హక్కులను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఏకంగా రూ.60 కోట్లకు దక్కించుకున్నారు. రామ్‌ కెరీర్‌ లోనే ఇది అతిపెద్ద రికార్డ్ డీల్ అని మేకర్స్ తెలిపారు. 


తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ కూడా పూర్తయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30 కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ లాగే డిజిటల్ రైట్స్ కూడా రామ్ కెరీర్ లోనే అత్యధిక ధరకు అమ్ముడయ్యాయని సమాచారం తెలుస్తుంది. ఆడియో రైట్స్ ఏకంగా రూ.9 కోట్లకు విక్రయించారు మేకర్స్. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తెలుగు సహా ఇతర భాషల శాటిలైట్ హక్కులు కూడా ఇంకా విక్రయించాల్సి ఉంది. అతి త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయనున్నారు మేకర్స్. ఇక ఆ డీల్స్ కూడా మంచి లాభాలతో జరుగుతాయని మూవీ టీమ్ చాలా నమ్మకంతో ఉంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలో రామ్ సరసన హాట్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: