టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డింపుల్ హాయాతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ భామ పేరు చెబితే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు గద్దలకొండ గణేష్. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఈ బ్యూటీ జర్ర జర్ర అనే ఐటమ్ సాంగ్ తో కుర్రకారును ఊపు ఊపేసింది. ఈ పాటలో డింపుల్ తన అందచందాలతో ఆకట్టుకుంది. అంతేకాకుండా తన డ్యాన్స్ తో రచ్చ చేసింది.


ఇక ఈ బ్యూటీకి ఇప్పుడిప్పుడే తెలుగులో కొద్దికొద్దిగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ మొదటగా గల్బ్ చిత్రంలో నటించింది. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాని నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించగా.... ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో ఈ భామ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.


ఇక ఈ సినిమాలో తన అందాలకు అందరూ స్టన్ అయిపోయారు. మొదటి హాఫ్ లో లంగా వోణీలో చాలా ట్రెడిషనల్ గా కనిపించి మెప్పించింది. ఇక రెండవ హఫ్ లో మాత్రం మోడ్రన్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత డింపుల్ హయాతీకి తెలుగులో రెండు మూడు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే డింపుల్ హయాతీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.


ప్రముఖ స్టార్ హీరో రవితేజ ఉంటున్న ఫ్లాట్ లో డింపుల్ హయాతి ఉంటుందట. వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు కానీ... ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఉంటున్న ఫ్లాట్ లో ఉంటుంది కాబట్టి...... వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీరు వివాహం చేసుకుంటారేమోనని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: