హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నది. అయితే ఈ సినిమాలో రాజమౌళి, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రలో కూడా కనిపించారు. అయితే వీరిద్దరూ కూడా ఈ సినిమాలో ఎలా భాగమయ్యారు అనే విషయాన్ని తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని సపోర్టు చేయడానికి వీరే ముందుకు వచ్చారని.. అయితే ఆయా పాత్రల కోసం వీధిద్దరిని ఒప్పించాల్సి వచ్చింది అంటూ కూడా తెలియజేశారు. అయితే వారు మంచి మనసుతో ముందుకు వచ్చారని తెలిపారు నాగ్ అశ్విన్.


ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ,దీపిక పదుకొనే ,కమలహాసన్ కు ఎంతో మంది అభిమానులు సైతం ఉన్నారు. అందుకే పాత్రలన్నిటికీ కూడా చాలా ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాము.మహాభారతంలో చాలా కీలకమైన పాత్ర అశ్వద్ధామ ఈ పాత్రకు అమితాబ్ తప్ప మరొకరిని ఊహించుకోలేమంటూ తెలియజేశారు.. దేశంలోనే పెద్ద స్టార్లలో ఒకరైన ఆయన మాత్రమే ఈ పాత్రకు చాలా శక్తివంతంగా చేయగలిగారని నమ్మాను అనుకున్నట్టుగానే ఆయన చేశారని తెలిపారు.


అలాగే అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే కొన్ని పోరాట సన్నివేశాలు తీయాలన్నదే మా కల.. మొదట ఈ చిత్రానికి అంగీకరించగానే చాలా ఆనందపడ్డానంటూ తెలిపారు నాగ్ అస్విన్. ఎన్నో అంచనాల మధ్య జూన్ నెలలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇప్పటికే ఈ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇతిహాసాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ సినిమా అని ప్రేక్షకులు చాలా కొత్త అనుభూతితో చూశారని చెప్పవచ్చు. కీలకమైన పాత్రలలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇతరత్న నటీనటుల సైతం నటించడం విశేషము. భౌంటీ ఫైటర్గా రాజమౌళి కనిపించారు అలాగే వర్మ కూడా చింటూ అనే ఫుడ్ వెండర్ గా కనిపించారు. మొత్తానికైతే పార్ట్-2 పై కల్కి సినిమాకి అంచనాలు పెంచేలా చేశారు డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: