టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ గురించి పరిచయం చేస్తే ఒకింత కామెడీగా ఉంటుంది.. ఎందుకంటే, అతని గురించి తెలియని ఇండియన్ ఉండడు అంటే అతిశయోక్తి లేదు. ఇక ఆయన నుండి వరుస ప్లాపుల తరువాత వచ్చిన కల్కి 2898ఏడీ ఏరీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. ఇంకా కలెక్షన్ల జోరు తగ్గకుండా సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇక కల్కి సినిమాతో మన డార్లింగ్ పాన్ ఇండియా నుండి ఏకంగా పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. ఇప్పట్లో ఇండియాలో ఇతర హీరోలు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో లేరని చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే సినిమాలపై ఇప్పుడు ఫాన్స్ దృష్టి మరలింది. వీటిలో ముందుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ కాగా మిగిలిన షూట్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా లేదంటే సమ్మర్ స్పెషల్ గా రాజా సాబ్ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మారుతి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్, బిగ్ హీరో మూవీ ఇదే కావడం విశేషం.

ఈ సినిమాకి మారుతి డైరెక్ట్ చేయడంతో ఆయనపైనే చాలా వత్తిడి ఉంది. ఇదివరకు చిన్నాచితకా సినిమాలు చేసిన మారుతికి ఈ సినిమాతో పెద్ద దర్శకుల సరసన చేరనున్నాడు. మారుతికి రాజా సాబ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఓ మంచి అవకాశం లభించిందనే అనుకోవాలి. అయితే అదేసమయంలో రెబల్ ఫాన్స్ ఊహించిన విధంగా లేకపోతే... అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఫ్యాన్స్ ని ఎక్కడా కూడా నిరాశ పర్చకుండా మారుతి పక్క ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్టు సమాచారం. సినిమా మారుతి స్టైల్ లోనే ఉంటూ... యాక్షన్ పార్ట్స్ కి ఎక్కడ కూడా కొదువ లేకుండా మారుతి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: