కోలీవుడ్ స్టార్ సూర్య కోసం బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఎవరు చేయని రిస్క్ చేసింది. అదేంటి అతని కోసం పూజా ఎందుకు రిస్క్ చేస్తుంది అనుకోవచ్చు. సూర్య నెక్స్ట్ సినిమా అదే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లో విజయ్ తో బీస్ట్ సినిమా చేశాక అమ్మడు దక్కించుకున్న ఛాన్స్ ఇదే. ఐతే ఈ సినిమాతో ఎలాగైనా మరోసారి తమిళ ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.

ఐతే సూర్య 44 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఊటీలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో సూర్య పాల్గొంటున్నాడు. ఐతే ఈ షెడ్యూల్ లో పూజా హెగ్దే ముందు వద్దనుకున్నారట. ఆమె లేకుండానే సూర్య మీద కొన్ని సీన్స్ షూట్ చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పూజా కూడా కావాలని అనుకోవడంతో ఆమెకు ఇంటిమేట్ చేశారట. ఐతే అమ్మడు ప్రతుతం ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది. సినిమా షూటింగ్ గ్యాప్ లో ఫారిన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంది పూజా హెగ్దే.

సూర్య 44 షూటింగ్ మొదలైనా తన పోర్షన్ లేదని అనుకుంది కానీ సడెన్ గా షూటింగ్ కి రావాల్సిందే అనేసరికి చేసేదేమి లేక వెంటనే ఇటలీ నుంచి ఊటీ వచ్చేసిందట. అమ్మడు ఇటలీ టు ఊటీ అని తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఎక్కడ ఇటలీ ఎక్కడ ఊటీ సినిమా కోసం పూజా డెడికేషన్ చూసి ఆడియన్స్ వావ్ అనేస్తున్నారు. షూటింగ్ కు వస్తున్నాం అంటే కొంత ప్రిపరేషన్ ఉండాలి కానీ పూజా మాత్రం విహార యాత్ర నుంచి డైరెక్ట్ గా షూటింగ్ కి వెళ్లింది. కోలీవుడ్ లో కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్దే ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: