ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీకి దరిదాపుల్లో ఏ మూవీ ని కూడా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ ఎప్పుడు అయితే పోస్ట్ ఫోన్ కానున్నట్లు వార్తలు రావడం మొదలు అయ్యాయో అప్పటి నుండే ఈ సినిమా విడుదల తేదీ పై అనేక మంది మేకర్స్ కన్ను పడింది.

మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం లేదు అని కన్ఫామ్ న్యూస్ రావడంతో అనేక మూవీ లు ఈ తేదీ పై పడ్డాయి. అందులో భాగంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలు కూడా అనేకం ఆగస్టు 15 వ తేదీన విడుదల కానున్నాయి. అందులో భాగంగా డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ , తంగాలన్ లాంటి మంచి క్రేజ్ ఉన్న మూడు సినిమాలు ఈ తేదీనే విడుదల కానున్నాయి. వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా ఈ తేదీనే రానున్నాయి. ఇకపోతే ఆగస్టు 15 వ తేదీన విడుదల కానున్న సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న మిస్టర్ బచ్చన్ , తంగాలన్ ఈ రెండు మూవీ ల యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి సంస్థ దక్కించుకుంది.

ఇక ఈ సంస్థ వారు ఈ రెండు సినిమాలను నైజాం ఏరియాలో పక్కా ప్లానింగ్ తో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక డబల్ ఈ స్మార్ట్ మూవీ యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను నిరంజన్ రెడ్డి దక్కించుకున్నాడు. అందులో భాగంగా ఈయన ఈ మూవీ ని నైజం ఏరియాలో కూడా విడుదల చేయనున్నాడు. ఒక వేళ మిస్టర్ బచ్చన్ , తంగాలన్ మూవీలకు కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే డబల్ ఇస్మార్ట్ మూవీ పై పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అలాగే నైజాం ఏరియాలో మైత్రి సంస్థకు మంచి పట్టు ఉంది. దానితో వారికి ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా డబల్ ఇస్మార్ట్ మూవీకి నైజాం ఏరియాలో భారీ ఎఫెక్ట్ అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ram