టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలలో నటించిన అందులో కొన్ని మూవీ లు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈయన మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో , రొటీన్ ఎంటర్టైనర్ మూవీ లలో నటించకుండా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలలోని నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే ఈయన తదుపరి మూవీలను అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు. మరి సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ లు మరియు వెబ్ సీరీస్ లు ఏవో తెలుసుకుందాం.

సందీప్ కిషన్ కొంత కాలం క్రితం రాజు అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కూడా సందీప్ కిషన్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మాయా ఓనే అనే తమిళ్ సినిమాలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతుంది. ఈ మూవీ ల తో పాటు నరగ సూరన్ అనే తమిళ సినిమాలో కూడా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ రూపొందుతుంది. వెబ్ అనే తెలుగు సినిమాలలో కూడా సందీప్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఇది న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లతో పాటు SK 30 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న తెలుగు సినిమాలో కూడా సందీప్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk