సినీ పరిశ్రమలో కొంతమందికి వరుసగా విజయాలు లేకపోయిన మంచి సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ రుహణి శర్మ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా రూపొందిన చి లా సౌ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇందులోని ఈమె నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకులు నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ స్థాయిలో ఈమెకు సినిమా అవకాశాలు తెలుగు లో దక్కలేదు  ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ లో రుహని డాక్టర్ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించకపోవడంతో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి కూడా పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఇక ఈమె నటించిన చి ల సౌ సినిమా తప్పితే ఏ మూవీ మంచి విజయం సాధించకపోయిన ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈమెకు మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కింది. అల్లరి నరేష్ హీరోగా రూపొందబోయే సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ సినిమా తాజాగా స్టార్ట్ కూడా అయింది. మరి ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే తెలుగు లో మరిన్ని సినిమాల్లో అవకాశాలు ఈ నటికి దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: