తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న వారు రెబల్ స్టార్ ప్రభాస్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరు నలుగురు కూడా ఇప్పటికే తమ సినిమాలను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసి అద్భుతమైన సక్సెస్ ను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నలుగురు ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాల పైన ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దీనితో ప్రభాస్ ఈమేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా , రామ్ చరణ్ "గేమ్ చేంజర్" మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూడు మూవీలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం.

ఇకపోతే ప్రస్తుతం అందరి టార్గెట్ కూడా కల్కి గానే మారింది. దేవర మూవీతో ఎన్టీఆర్ కచ్చితంగా కల్కి మూవీ రికార్డులను బద్దలు కొడతాడు అని ఆయన అభిమానులు భావిస్తూ ఉంటే , గేమ్ చేంజర్ మూవీ తో చరణ్ కూడా కల్కి మూవీ రికార్డులను కచ్చితంగా బద్దలు కొడతాడు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 మూవీ తో అల్లు అర్జున్ కూడా కల్కి మూవీ రికార్డులను ఈజీగా బద్దలు కొడతాడు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఒక వేళ కల్కి సినిమా రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో వీరు తమ సినిమాలతో కలెక్షన్లను రాబడితే వీరి ఈమేజ్ ఇండియా వ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: