మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దుల్కర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన దుల్కర్ ఆ సినిమాలో జెమినీ గణేశన్ గా  అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత ‘సీతా రామం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాతో దుల్కర్ తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.ప్రస్తుతం ఈ హీరో మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌ లోనే దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ ' 'కల్కి' లో గెస్ట్ రోల్ చేసి మెప్పించిన దుల్కర్ త్వరలో లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు.

’సార్’ సినిమాతో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తెలుగు యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సోంత బ్యానర్ అయిన స్వప్న సినిమాస్ ఈ సినిమా రూపొందిస్తున్నాయి ... దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఈ సినిమాకు “ఆకాశంలో ఒక తార” అనే టైటిల్ ప్రకటించారు.క్యూట్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ మరియు లైట్ బాక్స్ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం మరియు రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: