ఈ నేపథ్యంలోనే పలువురు సినిమా విశ్లేషకులు ఆయా సినిమాలపై అంత బడ్జెట్ తిరిగి వెనక్కి వస్తుందా? అనే అనుమానాలను వెళ్ళబుచ్చుతున్నారు. అందులో మొదటి సినిమా అల్లు శిరీష్ నటించిన బడ్డీ అనే పాన్ ఇండియా సినిమా. దీనికి మేకర్స్ సుమారు 100 కోట్లకు పైనే ఖర్చు చేసినట్టు సమాచారం. ఆల్రెడీ జీరో మార్కెట్ ఉన్న ఓ హీరో మీద ఇంత ఖర్చు చేయడం రిస్కే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది అలా ఉంటే.. విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమా ఇంకొకటి. పారంజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పైన అంచనాలు ఉన్నప్పటికీ.. విక్రమ్ మార్కెట్ అంతంత మాత్రమే అని అందరికీ తెలిసిందే.
ఇక వీటి తరువాత సూర్య హీరోగా త్వరలో విడుదల కాబోతున్న చిత్రం పేరు కొంగువా. ఈ సినిమాను కూడా స్టూడియో గ్రీన్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పైన హైప్ ఉన్నప్పటికీ... హీరో సూర్య పైన ప్రస్తుతం అంత మార్కెట్ లేదు కదా? అని పెదవి వివరిస్తున్న వారు కూడా ఎందరో ఉన్నారు. అది మాత్రమే కాకుండా సూర్య తమ్ముడు కార్తీ హీరోగా వాతియార్ సినిమా కూడా జ్ఞానవేల్ రాజా సమర్పిస్తుండడం విశేషం. ఇలా మొత్తంగా నాలుగు సినిమాలు నాలుగు వందల కోట్లకు పై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సంస్థకి ప్రస్తుతం ఒక టెన్షన్ పట్టుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు ఆయా సినిమా దర్శకుల విషయంలో కాస్త నమ్మకంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.