దిగ్గజ నటుడు..గొప్ప రాజకీయ నాయకుడు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇండస్ట్రీకి రాకముందు ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది అనే సంగతి చాలా మందికి తెలియదు.అయితే ఈ లవ్ స్టోరీని డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు మూవీ లో చూపించాలి అనుకున్నప్పటికీ అది కుదరలేదట. మరి ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి రాకముందు ఎవరిని ప్రేమించారు.. వీరి మధ్య ఎందుకు బ్రేకప్ జరిగింది అనేది చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ గాఢంగా ప్రేమించిన అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ కాదు..అలాగే ఆయన మరదలు బసవతారకం కాదు. వీరిద్దరు కాకుండా ఆయన పాల వ్యాపారం చేసే సమయంలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట.

అయితే అన్నగారు అప్పట్లోనే పాలు అమ్మే సమయంలో ఉదయాన్నే 3 గంటలకు లేచి పాలు పితికి సైకిల్ మీద విజయవాడ వెళ్లి అక్కడ ఓ హోటల్లో పాలు పోసి అలాగే అదే వీధిలో హోటల్ పక్కన ఉండే ఓ పెద్దింటి కాలనీలో కూడా పాలు పోసేవారట. అలా ప్రతిరోజు ఆయన పాలు పోస్తూ ఉన్న సమయంలో ఓ రోజు ఒక అందమైన అమ్మాయి ఉదయం ఎన్టీఆర్ దగ్గర పాలు తీసుకుందట. ఇక అదే సమయంలో ఇద్దరి చూపులు కలిసి ప్రతిరోజు ఉదయాన్నే మాట్లాడుకున్నారట. ఇక ఉదయం 3 గంటల సమయం కాబట్టి ఎవరూ ఆ టైం కి నిద్రలేవరు. దాంతో వీరిద్దరికీ ఏకాంతమైన సమయం దొరకడంతో ఇద్దరి మధ్య బలం మరింత బలపడింది. అయితే ఈ విషయం పోను పోను ఆ అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇచ్చి మీరు పాలు పోయడం వద్దు అని చెప్పేసారట.

దాంతో ఎన్టీఆర్ చాలా నిరశపడ్డారట. అయినప్పటికీ వీరిద్దరూ చాటుమాటు వ్యవహారాలు సాగిస్తూ అమ్మాయి పేరెంట్స్ కి కనిపించకుండా ఎన్నో రోజులు సీక్రెట్ గా కలిశారట. కానీ ఈ విషయం ఓసారి ఆ అమ్మాయి పేరెంట్స్ కి తెలియడంతో ఇంకా ఎన్ని అనర్ధాలు చూడాల్సి వస్తుందని అనుకున్నారో లేక ఎన్టీఆర్ తో ప్రేమలో పడి తమ కూతురు లేచిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రే ఊరోదిలి  వెళ్లిపోయారట.దాంతో అప్పటి జనరేషన్ అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఫోన్లు వంటివి ఎవరి దగ్గర లేవు. అలా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కట్ అయిపోయింది. అలా ఎన్.టి.రామారావు గారి జీవితంలో ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: