కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలక్షణమైన నటనతో వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ధనుష్ సినిమా వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ కు ఆరోజు పండగే అంతలా ఎదురు చూస్తూ వుంటారు. ధనుష్ కూడా ఫ్యాన్స్ ని డిస్సోపాయింట్ చేయకుండా ఆరు నెలలకు ఒకసారి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.. దీనితో ధనుష్ ఫ్యాన్స్ ఆ సినిమాల రిలీజ్ రోజు ఎంతో సందడి చేస్తూ వుంటారు.ఇదిలా ఉంటే తాజాగా హీరో ధనుష్ డైరెక్ట్‌ చేస్తూ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాయన్‌’.. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయి మంచి టాక్‌ తెచ్చుకుంటోంది.ఈ సినిమాతో హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మంచి మార్కులు  కొట్టేసాడు  ధనుష్‌.కాగా ఈ స్టార్ హీరో వరుస సినిమాల కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు.

ధనుష్ చేసే మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. D51గా తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది.అలాగే అక్కినేని నాగార్జున  కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో ఇప్పటికే షేర్ చేసిన చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ కుబేర ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేస్తోంది. తాజాగా ధనుష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ..స్పెషల్‌ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. గుబురు గడ్డం, మాసిన చొక్కాలో అమాయకంగా కనిపిస్తున్న ధనుష్ లుక్ అదిరిపోయింది.ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: