రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. జూన్ 27 వ తేదీన ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దీనికి మంచి టాక్ రావడంతో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకా పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 570 కోట్లు షేర్, రూ. 1175 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 


ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నేపాల్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. అక్కడ ఈ సినిమా తాజాగా రూ. 23 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గతంలో ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' రికార్డును క్రాస్ చేసింది. ఏడేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి 2' అక్కడ బాక్సాఫీస్ దగ్గర రూ. 23 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ లో నిలిచింది.ఆ తర్వాత విడుదలైన మరే భారతీయ చిత్రం అక్కడ ఈ రేంజ్ వసూళ్లను అందుకోలేకపోయింది. తాజాగా ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ నేపాలీ బాక్సాఫీస్ దగ్గర రూ. 24 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇక ఈ సినిమాని మహా భారత కాలం నుంచి భవిష్యత్తు 2898లో ప్రపంచం ఎలా ఉండబోతుందో తన ఊహాజనితంగా తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అందువల్ల ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఆగష్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: