ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలను సైతం తలపించేలా కనిపిస్తున్నాయి.. గతంలో మా ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే చూశాము. ఇప్పుడు తాజాగా తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో అధ్యక్షుడిగా దిల్ రాజు ఉన్నారు.అయితే ఇటీవల ఆయన పదవీకాలం కూడా ముగిసిందిట. దీంతో  ఈ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కానీ ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పంపిణీ రంగానికి చెందిన వారిని పెంచుకోవడం జరిగింది.


గత ఏడాది సినీ నిర్మాత అయినటువంటి దిల్ రాజుకు సైతం అవకాశం ఇచ్చారు. దిల్ రాజు పదవి కాలం కూడా ఇటీవలే ముగియడంతో ఎన్నికలు సైతం నిర్వహించారు ఇలా ఏడాదికి ఒకసారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలను సైతం నిర్వహిస్తూ ఉండడం జరుగుతొందట. మొత్తం మీద 48 మంది సభ్యులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఇందులో 46 మంది సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భరత్ భూషణ్ కి 29 ఓట్లు.. ఠాగూర్ మధుకి 17 ఓట్లు పడ్డాయట

భరత్ భూషణ్ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి అధ్యక్షుడిగా ఆయనను ఎంచుకోవడం జరిగింది. అలాగే మరొకవైపు ఉపాధ్యక్ష పదవి కోసం వై వి ఎస్ చౌదరి, అశోక్ కుమార్ వంటి వారు పోటీ పడడం జరిగింది. అయితే ఇందులో అశోక్ కుమార్కు 28 ఓట్లు పడగా ,వైవిఎస్ చౌదరికి 18 ఓట్లు మాత్రమే పడ్డాయి. అలా నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడు వరకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్ష , ఉపాధ్యక్షుడినీ 48 మంది సభ్యులు సైతం ఎంచుకుంటారట. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు ఫిలిం ఛాంబర్ కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ ఎలాంటి మేలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: