డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ తాజాగా  రూపొందించిన చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించారు.మరాఠీ హాట్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఆదివారం నాడు నిర్వహించింది. ప్రచార చిత్రం విడుదల తరువాత మిస్టర్ బచ్చన్ టీమ్‌.. మీడియాతో మాట్లాడటం జరిగింది. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన 'డబుల్‌ ఇస్మార్ట్‌' అదే డేట్‌కు వస్తుండదాన్ని ఉద్దేశిస్తూ గురుశిష్యుల పోటీనా? అని ఓ విలేకరి ప్రశ్నించగా అందుకు హరీశ్‌ శంకర్ ఇలా స్పందించడం జరిగింది.''నేను డైరెక్టర్ గా ఎదిగే క్రమంలో ప్రోత్సహించిన దర్శకులు వీవీ వినాయక్‌, రాజమౌళి, పూరి జగన్నాథ్‌. నా సినిమాల్లోని పాటలు, మాటలు నచ్చితే ఫోన్‌ చేసి ఎంతగానో అభినందించేవారు. వారు నాకు గురువులతో సమానం. పూరి జగన్నాథ్‌తో కలిసి ఎక్కువగా పని చేశా. ఆయనతో పోల్చుకునే స్థాయి నాది కాదు. ఆయన ఒక లెజండరీ డైరెక్టర్‌. అయితే పలు కారణాల వల్ల ఒకే రోజున మా సినిమాలు విడుదల కానున్నాయి. 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమా రిలీజ్‌ డేటే ముందుగా ప్రకటించారు.


ఆ తేదీన మా సినిమాని విడుదల చేయాలని మేం అసలు అనుకోలేదు. 'ఆగస్టు 15న విడుదల చేయండి.. మంచి డేట్‌' అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధినేత శశి మాకు పదేపదే చెప్పడం జరిగింది. ఒక్క సినిమా క్లాష్‌ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్‌కు, నాకు మధ్య మాటలుండవని నేను అనుకోను. ఆయన నాకంటే చాలా మెచ్యూర్‌'' అని సమాధానమిచ్చారు హరీష్ శంకర్.'అయితే ఆ సినిమా నిర్మాత ఛార్మి సోషల్‌ మీడియాలో మిమ్మల్ని అన్‌ఫాలో చేశారు కదా' అని అడగ్గా.. ''నేను ముందు ప్రకటించిన డేట్‌కి మరో సినిమా విడుదలవుతుంటే నాకు కూడా ఇరిటేషన్‌ ఉంటుంది. అందుకు నేను ఛార్మిని తప్పుపట్టను. కానీ సోషల్‌ మీడియాలో ఎవరి ఇష్టం వారిది. ఆమె నన్ను అన్‌ఫాలో అయ్యారో లేదో నేను ఇంకా చెక్‌ చేసుకోలేదు. దానిపై క్రియేట్‌ చేసిన ఓ మీమ్‌ ఒకటి చూశానంతే. అయితే ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోను. పరిస్థితుల ప్రభావమిది. 'డబుల్‌ ఇస్మార్ట్‌', 'మిస్టర్‌ బచ్చన్‌' రెండూ సినిమాలు మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: