రీసెంట్ గా కోలీవుడ్ లో వచ్చిన మహారాజ సినిమా థియేట్రికల్ రన్ లో సూపర్ హిట్ అయ్యి ఈమధ్యనే ఓటీటీలో రిలీజై అక్కడ సూపర్ సక్సెస్ అయ్యింది. సినిమా తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అవ్వగా ఓటీటీ తెలుగు వెర్షన్ కూడా బాగా వ్యూస్ సాధించింది. నిథిలన్ స్వామి నాథన్ డైరెక్ట్ చేసిన మహారాజ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా కూడా మంచి సినిమా చూశామన్న భవన పొందారు.

ఐతే ఇలాంటి కథలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి కానీ ఈసారి విజయ్ సేతుపతి లాంటి స్టార్ కోలీవుడ్ లో అటెంప్ట్ చేశాడు. ఐతే మహారాజ సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ కు ఇలాంటి సినిమాలు ఎందుకు తెలుగు సినిమాల్లోకి రావట్లేదని అనుకుంటున్నారు. ఆ సినిమా కథ ఒకవేళ తెలుగు హీరోల దగ్గరకు వారు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెడుతున్నాఉరు.

స్టార్ హీరోలు లేదా సీనియర్ స్టార్స్ అయినా ఇలాంటి కథలు చేస్తే తప్పకుండా వారి ఇమేజ్ కి తగినట్టుగా ఉండటంతో పాటుగా మంచి సినిమా తీశారన్న టాక్ కూడా ఆడియన్స్ లో ఉంటుంది. ముఖ్యంగా మహారాజ లాంటి సినిమా మాస్ యాక్షన్ ఇమేజ్ ఉన్న హీరోలైన రవితేజ లాంటి వారు చేసినా సరే తెలుగు ప్రేక్షకులు ఆదరించే వారని అంటున్నారు. ఏది ఏమైనా మహారాజ సినిమా చూసిన తెలుగు స్టార్స్ కూడా తమ దగ్గరకు వచ్చే ఇలాంటి కథలను చిన్న చూపు చూసే అవకాశం ఇవ్వకుండా ఆ సినిమా రిజల్ట్ అందించింది. విజయ్ సేతుపతి స్టామినా చూపంచేలా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి వారెవా అనిపించింది. తెలుగులో కూడా కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ఇలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తే మన హీరోలు కూడా ఇలాంటివి మరిన్ని చేసే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: