ఆగష్టు 15న పూరీ రామ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటీగా మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ వస్తుంది. ఐతే ఈ రెండు సినిమాల రిలీజ్ క్లాష్ పై హరీష్ శంకర్ కామెంట్స్ ఇప్పుడు అందరినీ సర్ రైజ్ చేస్తున్నాయి. పూరీ తనకు గురు సమానులు అని చెప్పుకొచ్చిన హరీష్ శంకర్ ఆయనతో తనకు పోటీ కాదు అసలు ఆయన స్థాయి వేరు అని అన్నారు హరీష్ శనక్ర్.

ఐతే డబుల్ ఇస్మార్ట్ సినిమానే ముందు రిలీజ్ అనౌన్స్ చేశారని కాకపోతే తమ సినిమా రిలీజ్ కూడా అదే రోజు పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాదు ఈ విషయంపై ఆ సినిమా నిర్మాత చార్మీ కోప్పడటంలో తప్పులేదని అన్నారు. ఐతే సినిమా రిలీజ్ విషయంలో ఓటీటీ రిలీజ్ కమిట్మెంట్ కూడా ఉన్నట్టు ప్రస్తావించారు హరీష్ శంకర్. అంటే సినిమాల రిలీజ్ లను ఓటీటీ లు డిసైడ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పకనే చెప్పారు.

ఐతే సినిమా థియేట్రికల్ రిలీజ్ ని నిర్మాతల చేతుల్లో కాకుండా అలా ఓటీటీ లో చేతుల్లో వెళ్లడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. సినిమా బిజినెస్ ల రూపంలో నిర్మాణ దశలోనే ఓటీటీ ల నుంచి డబ్బు తీసుకోవడం వల్ల ఆ సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఓటీటీ సంస్థల చేతుల్లో వెళ్తుంది. అందుకే హరీష్ శంకర్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పారు.

రవితేజ సినిమా అనే కాదు చాలా సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిర్మాణంలో ఉన్న సినిమాలకు ముందే ఓటీటీ రైట్స్ రూపంలో డబ్బులు ఇవ్వడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది. మరి థియేట్రికల్ రిలీజ్ ని శాసించే స్థాయికి ఓటీటీల ప్రభావం ఉందా అంటే నిజమే అని కొన్ని సందర్భాలు చూస్తే అర్ధమవుతుంది. మరి రానున్న రోజుల్లో ఇది కొనసాగితే మాత్రం కష్టమే అవుతుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

OTT