హరీష్ శంకర్.. పూరి జగన్నాథ్  శిష్యుడు. చాలా మందికి తెలిసిన విషయమే. మళ్ళీ వీరిద్దరూ రాంగోపాల్ వర్మ  శిష్యులు. అది కూడా చాలా మందికి తెలుసు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుజ్జిగాడు’  ‘నేనింతే’  వంటి సినిమాలకి హరీష్ శంకర్ పనిచేశాడు. హీరో క్యారెక్టరైజేషన్ తో మాస్ సినిమాలు తీయడం పూరికి బాగా తెలుసు. మాస్ సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చే విధంగా తీయడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. డైలాగ్స్ అయితే ఇద్దరి సినిమాల్లోనూ అదిరిపోతాయి.ఇద్దరికీ మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. అన్నిటికీ మించి యూత్ లో వీరిద్దరి సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి స్ట్రెంత్ ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి.ఇద్దరికీ మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. అన్నిటికీ మించి యూత్ లో వీరిద్దరి సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి స్ట్రెంత్ ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి.2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా నటించాడు. ఫస్ట్ పార్ట్ లో రామ్ తో పాటు నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్ నటించారు. బట్ ఈసారి హీరోయిన్ గా కావ్య థాపర్ ను తీసుకున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ తో పాటు రెండు పాటలూ ఆకట్టుకున్నాయి. కంప్లీట్ పూరీ జగన్నాథ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ. ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. కానీ పూరీ మారినట్టు కనిపించడం లేదు. బట్ ఈ టైప్ మాస్ ఎంటర్టైనర్స్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు.

ఇక 2018లో బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన రైడ్ చిత్రానికి రీమేక్మిస్టర్ బచ్చన్. మాస్ మహరాజ్ రవితేజ, భాగ్య శ్రీ బోర్సె జంటగా నటిస్తోన్న ఈ మూవీ 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రీమేక్ అంటే హరీష్ శంకర్ ఇంకా ఇంప్రవైజ్ చేస్తాడు. బెటర్ గా రాసుకుంటాడు. పైగా తనకు ఇష్టమైన రవితేజ హీరో కాబట్టి ఆ ఇమేజ్ కు తగ్గట్టుగానే రాసుకుని ఉంటాడు. ఇంకా టీజర్, ట్రైలర్ రాలేదు కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం. బట్ కొన్నాళ్లుగా రవితేజ వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. దానికి హరీష్ శంకర్ బ్రేకులు వేస్తాడు అంటున్నారు.రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే.. రెండు బాగా ఆడతాయి. కానీ ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది? అనేది అంచనా వేయలేం. అయితే ‘మిస్టర్ బచ్చన్’ తో పోలిస్తే ‘డబుల్ ఇస్మార్ట్’ కి బిజినెస్ ఎక్కువ జరిగింది. అందువల్ల ‘మిస్టర్ బచ్చన్’ పోటీగా రిలీజ్ అవ్వడం వల్ల ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా ఆర్జీవీ ఫాలోవర్స్ గా పూరీ, హరీష్ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడుతుండటం మాత్రం బాక్సాఫీస్ కు ఓ కొత్త జోష్ తెచ్చేదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: