టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటుంది. అందుకే అందరు హీరోయిన్స్ కూడా టాలీవుడ్ పై ఆసక్తిగా చూస్తుంటారు. ఇక్కడ ఛాన్స్ వచ్చి ప్రూవ్ చేసుకుంటే చాలు కానీ స్టార్ రేంజ్ కి వెళ్లొచ్చు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంటే అదే క్రేజ్ ని ఇతర పరిశ్రమల్లో కూడా కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. అందుకే తెలుగు సినిమాల మీదే కథానాయికలంగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఐతే కొత్తగా వచ్చే భామల్లో కూడా ఎవరికి ఆ స్కోప్ ఉంటుందని అంచనా వేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు తెర మీద ఓ ముద్దుగుమ్మ తన సత్తా చాటాలని చూస్తుంది. బాలీవుడ్ లో రెండు సినిమాల అనుభవం ఉన్న భాగ్య శ్రీ బోర్స్ తెలుగులో రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో భాగ్య శ్రీ రిలీజ్ ముందే మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ ని ఎలా చూపించాలో బాగా తెలిసిన హరీష్ శంకర్ భాగ్య శ్రీ అందాలను బాగా ఎక్స్ పోజ్ చేశాడు.

ఇక లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ సందర్భంగా భాగ్య శ్రీ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా స్టేజ్ మీఅ మిస్టర్ బచ్చన్ సాంగ్ కి డాన్స్ చేసింది. అమ్మడి ఊపు చూస్తుంటే కచ్చితంగా తెలుగులో స్టార్ రేంజ్ కి వెళ్లేలా ఉంది. ఎంతోమంది ముంబై భామలను స్టార్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ లో కొంత టాలెంట్ ఉంటే చాలు అందలం ఎక్కించేస్తారు. చూస్తుంటే భాగ్య శ్రీకి ఆ టాలెంట్ బాగా ఉందనిపిస్తుంది. మరి అమ్మడు రవితేజ సినిమాతో లక్కీ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి సినిమా హిట్ పడితే దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: