గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగచైతన్య తన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీ టీజర్ కు కూడ మంచి స్పందన రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. వాస్తవానికి ఈ మూవీని డిసెంబర్ 20న విడుదలచేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావించారు. అయితే ఇప్పుడు వారికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అడ్డుతగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  



‘గేమ్ ఛేంజర్’ తో ఈ మూవీ పోటీపడటం జరగని పనికాబట్టి ఇప్పుడు ఈ మూవీ నిర్మాతలు మరొక రిలీజ్ డేట్ గురించి ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కాకుంటే ఆడేట్ కు ‘తండేల్’ మూవీని తీసుకు రావాలని నిర్మాతల ఆలోచన అని అంటున్నారు.



ఒకవేళ అది కుదరకపోతే నవంబర్ లో ఈమూవీని విడుదల చేయడం మినహా మరొక మార్గం లేదు అని అంటున్నారు. అయితే ఈమూవీ నిర్మాతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీకి కలక్షన్స్ చాలకీలకం కాబట్టి ఈ మూవీని సంక్రాంతి రేస్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది.



అయితే సంక్రాంతి రేస్ కు ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ ప్రభాస్ ‘రాజా సాబ్’ వెంకటేష్ అనీల్ రావిపూడిల సినిమాలు ఫిక్స్ అవ్వడంతో అక్కడ నాగచైతన్యకు స్థానం దక్కడం జరగనిపని అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ మూవీ విడుదల వచ్చే వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి వాయిదా పడినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ మూవీలో చైతన్య పక్కన సాయి పల్లవి నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై యూత్ లో కూడ మంచి అంచనాలు ఉన్నాయి. జరిగిన ఒక వాస్తవ సంఘటనకు దేశభక్తిని రంగరించి ఈమూవీ తీయడంతో అంచనాలు వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి..  





మరింత సమాచారం తెలుసుకోండి: