సినిమా హీరోల సంపాదన గురించి జనాలకు తెలిసిందే. వారి వారి సినిమా మార్కెట్ ని బట్టి వారు కోట్లలోనే తీసుకుంటూ ఉంటారు. ఇక బడా హీరోల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఓ నిర్మాత సినిమాకు ఖర్చు చేసిన దాంట్లో సగం డబ్బు హీరోకే పోతుంది. అలాంటిది సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరో గురించి ఇక ఊహించుకోవచ్చు. అయితే ఆయన బాడీ గార్డ్ సంపాదన కూడా అదే స్థాయిలో ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? అవును, మీరు విన్నది నిజం... ఆ బాడీగార్డుకి సల్లూ భాయ్‌ కోట్లలో జీతం ఇస్తున్నాడు. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తున్నాడని సర్వేలు చెబుతున్నాయి మరి.

అతనే సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ. గత 3 దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్గా వ్యవహరిస్తున్న ఇతన్ని మన సల్లూ భాయ్‌ ముద్దుగా  షేరా అని పిలుచుకుంటారు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా ముంబయి నగరంలో 1969లో పుట్టాడు. అతనికి బాడీ బిల్డింగ్లో ఇంటరెస్ట్ ఉండడంతో బాగా శిక్షణ పొంది జూనియర్ బాడీ బిల్డింగ్లో ఛాంపియన్‌ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలు పెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పని చేయగా సల్మాన్ ఖాన్‌కు పరిచమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్నారు.

ఇక అప్పటినుండి సల్మాన్ అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. ఆయన పక్కన లేనిదే మన సల్లూ భాయ్ బయట కాలు పెట్టనే పెట్టడు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్కు నమ్మకం, చనువు కాస్త ఎక్కువే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీరిద్దరి ఫొటోలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఫొటొల్లో షేరా సల్మాన్ ఖాన్ భూజాలపై చేయి వేసి నిలబడటం మనం గమనించవచ్చు కూడా. ఇంతకీ షేరా జీతం ఎంతో అని ఆలోచిస్తున్నారు కదా? అక్కడికే వస్తున్నాం.. ఆయన జీతం ఏడాదికి అక్షరాలా 5 కోట్ల రూపాయలు. అంటే నెల తిరిగేసరికి మనోడి అకౌంట్‌లో సుమారుగా 40 లక్షల రూపాయలు జమ అవుతాయన్న మాట. మరి చెప్పండి.. మీకు అంత జీతం వస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: