డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో లిరికల్ సింగిల్స్ ఒక్కొక్కటి విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట శ్రోతల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మెలోడీ బ్రహ్మ మణిశర్మ మార్క్ మ్యూజిక్ అంటూ డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ కి ముద్ర పడింది. ఇక రెండు రోజుల క్రితం క్యా లప్డ అనే సాంగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పక్కా పూరి మార్కో ప్రొమోగా సోషల్ మీడియాలో హైలైట్ అయింది.తాజాగా క్యా లప్డే లిరికిల్ సింగిల్ కొద్ది సేపటి క్రితమే యూ ట్యూబ్ లో రిలీజ్ అయింది.ఈ సాంగ్ మెలోడీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాట నెమ్మదిగా ప్రారంభమైనా కానీ లోతులోకి వెళ్లే కొద్ది క్యా లప్డే శ్రోతల్ని ఎంతగానో అలరిస్తుంది. మెలోడీని బ్యాలెన్స్ చేస్తూ సాంగ్ కంపోజిషన్ కూడా చాలా బాగుంది. పూరి జగన్నాథ్ మార్క్ అందమైన హీరోయిన్ అయిన కావ్య తాపర్ పాటలో చాలా బాగా హైలైట్ అవుతుంది. 


మొత్తంగా క్యా లప్డ పాట అందమైన రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుంది.పూరి జగన్నాథ్ అన్ని సినిమాల్లో కూడా ఇలాంటి మెలీడీలు తప్పనిసరిగా ఉంటాయి. సక్సెస్ సెంటిమెంట్ గానూ పూరీ సినిమాలకి మెలోడీలు కలిసొచ్చాయి. మరి ఈసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా అన్నది చూడాలి. డిజైనర్ డ్రెస్సులో కావ్యా థాపర్ కుర్రాళ్లను హీటెక్కించడం ఖాయంలాగా ఉంది. ఈ పాటని శ్రీ హర్ష ఈమని రాయగా, ధనుంజయ్, సింధుజా శ్రీనివాసన్ పాడటం జరిగింది.ఈ సినిమాని పాన్ ఇండియాలో ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ పూరి అండ్ కోకి చాలా అవసరం. గత సినిమా లైగర్ పాన్ ఇండియాలో అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా అంతేగాక ఈ సినిమా విజయ్ దేవరకొండకి తీవ్ర విమర్శలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడా లెక్కలన్నింటిని డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్రమే సరి చేయాల్సి ఉంది. మరి చూడాలి ఎన్నో అంచనాలతో ఈ సినిమా ఎలాంటి హిట్టుని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram