విషయంలోకి వెళితే... సదరు యాంకర్ ఇంటర్వ్యూలో పలువురు స్టార్స్ అప్పటి, ఇప్పటి ఫొటోలు చూపిస్తూ వీరికి సర్జరీ జరిగిందా? అంటూ ప్రశ్న వేశారు. దీనికి డాక్టర్ రాజశేఖర్ స్పందిస్తూ... క్లియర్‌గా ఆన్సర్ చేసారు. ఆ లిస్టులో ముందుగా హీరో దుల్కర్ సల్మాన్ ఫొటో చూపించగా... ఆయన ముక్కుకి ఖచ్చితంగా రైనో ప్లాస్టీ చేయించారంటూ డాక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు ఫొటోలో ఆయన ముక్కు కాస్త లావుగా ఉండగా ఇప్పుడు చాలా సూటిగా కనిపిస్తుందని అన్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికని ఉద్దేశించి కూడా ముక్కుకి సర్జరీ జరిగినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఫొటో.. ఇప్పటి లేటెస్ట్ పిక్ చూపించి యాంకర్ అడగగా డాక్టర్ కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ... "ఈ ఫొటోలో అల్లు అర్జున్ కి చాలా స్పష్టంగా ముక్కుకి సర్జరీ అయినట్లు తెలుస్తోంది.. అలానే లిప్స్ కి కూడా సర్జరీ జరిగింది. నా అవగాహన ప్రకారం ఆయన తన ముఖం మొత్తం కూడా సర్జరీ చేసుకొని ఉండొచ్చు!." అంటూ డాక్టర్ అభిప్రాయ పడ్డారు. అలానే అమీ జాక్సన్, శోభిత ధూళిపాళ్ల కూడా ఫేస్‌లో మార్పుల కోసం పలు సర్జరీలు చేయించి ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. పలువురు బిగ్‌బాస్ సెలబ్రెటీలు తమ ముక్కు బాలేదని, మూతి బాలేదంటూ తమ దగ్గరకి వచ్చి పలు సర్జరీలు, ఫిల్లర్స్ వంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. కాగా అల్లు అర్జున్ సర్జరీకి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బన్నీ అభిమానులు ఆ డాక్టర్ పైన చిందులు తొక్కుతున్నారు!