కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 50వ సినిమా 'రాయన్' భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ అదరగొడుతోంది. ఈ సినిమాకి కథతో పాటు దర్శకత్వం కూడా ధనుషే చేశారు. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ధనుష్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో ధనుష్ ఎంతగానో మెప్పించారు. రాయన్‍ మూవీతో నటుడి, దర్శకుడిగా మెప్పించారు. గత శుక్రవారం (జూలై 26) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను దక్కించుకుంది. తొలి వీకెండ్ (మూడు రోజులు) వసూళ్లు దుమ్మురేపింది.ఇక రాయన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఏకంగా రూ.75.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ధనుష్ కెరీర్లో ఇదే బెగ్గెస్ట్ ఫస్ట్ వీకెండ్‍ అనే చెప్పాలి. ఈ వీక్ లో రాయన్ సినిమా రూ.100 కోట్లను దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ధనుష్ గత మూవీ కెప్టెన్ మిల్లర్ లైఫ్ టైం వసూళ్ళని ఫస్ట్ వీకెండ్ వసూళ్ల తో రాయన్ భారీ తేడాతో దాటేసింది.


ధనుష్‍కు తన కెరీర్లో ఈ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాయన్ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది.రాయన్ మూవీకి తమిళనాడులో భారీ వసూళ్లు రాగా.. తెలుగులో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. తమిళనాడులో తొలి మూడు రోజుల్లో ఈ మూవీకి ఏకంగా రూ.33 కోట్ల కలెక్షన్లు రాగా.. విదేశాల్లో రూ.21కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.8కోట్లు దక్కాయని సమాచారం తెలుస్తోంది.రాయన్ సినిమాలో ధనుష్‍తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కాళి దాసు జయరాం కూడా మెయిన్ రోల్స్ చేశారు. ఎస్‍జే సూర్య, దసరా విజయన్, అపర్ణా బాలమురళి, శరవణన్, సెల్వరాఘవన్, ప్రకాశ్ రాజ్ ఇంకా దిలీపన్ కీలకపాత్రలు పోషించారు.రాయన్ మూవీలో ధనుష్ మరోసారి తన మార్క్ యాక్షన్‍తో అదరగొట్టారు. రస్టిక్ లుక్‍లో యాక్షన్ సీక్వెన్సుల్లో ధనుష్ దుమ్మురేపారు.ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.రాయన్ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. సుమారు రూ.90బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: