నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన దర్శకుని కోసం అన్వేషించి ఆ అవకాశాన్ని ప్రశాంత్ వర్మకు ఇచ్చారు. హనుమాన్ సినిమాతో తన టాలెంట్ ను పాన్ ఇండియా లెవెల్ లో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ . గతంలో తీసిన జాంబీ రెడ్డి చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించింది.ప్రశాంత్ వర్మ కుడా జై హనుమాన్ ని పక్కనబెట్టి మోక్షజ్ఞ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయ్యాడు. తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై హైప్ క్రియేట్ చేసే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. మోక్షజ్ఞ కోసం రెడీ చేసిన కథలో హైలెట్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.మొత్తానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కోసం సరైన దర్శకున్నే ఎంచుకున్నాడని అభిమానుల అభిప్రాయం. ఈ దర్శకుడు మోక్షజ్ఞ కోసం ఒక మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమచారం. ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ తో చేయబోయే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సిద్దం చేశారని టాక్ . మహాభారతంలోని ఒక ధైర్యవంతుడు అయిన ఒక వీరుని కథ ఆధారంగా చేసుకుని ఈ మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

మైథాలజీ నేపథ్యంలో సాగే ఆ సినిమాలో మహాభారతంలోని అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు సమాచారం.ఇదే మూవీలో బాలకృష్ణ కూడా నటించనున్నట్లు టాక్.తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూపించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట.మరి ఈ వార్తల్లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే.ఒకవేళ ఇదే వార్త నిజం అయితే మోక్షజ్ఞ మొదటి చిత్రంతోనే భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశలు ఉన్నాయి.అన్నట్టు ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ కథ గురించి హైలెట్స్ వింటుంటే… ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు మొదలైయ్యాయి.మొత్తం మీద ఓ సంచలనానికి రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నందమూరి మోక్షజ్ఞ తో చేయబోయే ఈ ప్రాజెక్ట్ ను బాలకృష్ణ రెండో కూతురు తేజశ్విని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దర్శకుడు ఇటీవల దాదాపు 30 కోట్ల వ్యయంతో స్వంత ప్రొడక్షన్ ఆఫీస్‌ని కూడా నిర్మించుకుంటున్నాడని సమాచారం. ఈ ఆఫీసులో వంద మంది వరకు వివిధ శాఖలకు చెందిన వారు ఈ ఆఫీసులో పని చేస్తారట. తన సినిమాకు సంబంధించిన ప్రతి పని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఈ ఆఫీసులోనే జరిగేటట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: