టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హరీష్ శంకర్ త్వరలోనే మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు  రావడానికిసిద్ధమవుతున్నారు.ఈయన చివరిగా గద్దల కొండ గణేష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా విడుదలయి దాదాపు ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు తదుపరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక త్వరలోనే రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతోంది.కాగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 7 సినిమాల్లో రెండు రీమేక్స్ ఉన్నాయి.గబ్బర్ సింగ్ హిందీ దబంగ్ రీమేక్ కాగా, తమిళ క్లాసిక్ జిగర్తాండ రీమేక్ గా గద్దలకొండ గణేష్ తెరకెక్కింది.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సినిమా కూడా రీమేక్ అనే వాదన ఉంది.దీంతో ఒక నేటిజన్ ఈయన సినిమాల గురించి కామెంట్ చేస్తూన్నారు. వీటి పై స్పందిస్తూ డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్ లు తీయడమే కష్టమని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. హిట్ అయినా సినిమాలే రీమేక్ చేస్తాం. కాబట్టి ఆ మూవీ కంటే మనదే బాగుండాలనే అంచనాలను అందుకోవాలని ఒత్తిడికి గురవుతాం. అయినా ఒక మూవీ తీయడానికి మరో సినిమా ఎందుకు ప్రేరణ కాకూడదు? గబ్బర్ సింగ్, గడ్డలకొండ గణేష్ చిత్రాలు చూసి రీమేక్ అంటే వాళ్ళ సినిమా పరిజ్ఞానం పట్ల జాలిపడతానే తప్ప సీరియస్ గా తీసుకోను అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు.ఇలా ఈయన ఇచ్చిన సమాధానం చూస్తుంటే మిస్టర్ బచ్చన్ సినిమా రీమేక్ కాదని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక దాదాపు 13 సంవత్సరాల తర్వాత రవితేజ హరీష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ భామ బోర్సే భాగ్యశ్రీ క‌థానాయిక‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: