యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఇట్టే వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్టింగ్‌ నుంచి లీక్‌లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో లీక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇక దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణద్ రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. ఎప్పుడెప్పుడు దేవర నుంచి ఏ అప్ డేట్ వస్తుందానని ఎన్టీఆర్ అభిమానులు కూడా తెగ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు.తాజాగా దేవర షూటింగ్ సెట్‌లో నుంచి ఎన్టీఆర్ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో ఇప్పటివరకూ కనిపించిన దేవర లుక్‌తో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు ఎన్టీఆర్. బ్లాక్ షర్ట్‌లో కాస్త గుబురు గడ్డంతో, తక్కువ జుట్టుతో కనిపించారు తారక్. అయితే ఇప్పటివరకూ చూపించిన దేవర లుక్‌లో తక్కువ గడ్డం, ఉంగరాల జుట్టుతో అదరగొట్టారు ఎన్టీఆర్. ఇప్పుడు డిఫరెంట్‌గా ఉండటంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రికొడుకుగా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకూ మూవీ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ రెండో భాగంలో ఉండే అవకాశం ఉందని టాక్. మొత్తానికి సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే దేవర సెట్స్ నుంచి ఇలా లీకులు రావడం ఇది కొత్తేం కాదు.దీనిపై మూవీ టీమ్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా దేవరకి లీకులు తప్పట్లేదు. తాజాగా లీక్ అవుతున్న ఫొటోను షేర్ చేయొద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: