స్టార్ డైరెక్టర్రాజమౌళి తెరకెక్కించిన ఐకానిక్ సినిమాల్లో 'ఈగ' ఒకటి. అప్పటివరకు జక్కన్న సినిమాల్లో హీరో చుట్టూ కథ తిరుగుతూ ఉండేది, అయితే ఇందులో మాత్రం విన్నూత్నంగా ఆయన ఈగను హీరోగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ హాఫ్లో నాని కనిపించినప్పటికీ, సెకెండాఫ్లో ఈగ క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఈగ రూపంలో వచ్చిన నాని విలన్ను ఎలా మట్టుకరిపిస్తాడన్నడే ఈగ స్టోరీ. ఈ రివెంజ్ డ్రామాకు మన తెలుగు ప్రేక్షకులే కాదు మిగిలిన దక్షిణ భాషల ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. నార్త్లోనూ మక్కీగా హిందీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.ఈ నేపధ్యం లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కాంబో కారణాలతో ఆగిపోవడం.. లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటిది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం.. కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు ఫీల్ అవ్వడం కూడా కామన్.కాగా రాజమౌళి డైరెక్షన్‌లో నాగచైతన్య బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

రాజమౌళితో ఒక్క సినిమా అవకాశం దొరికితే చాలు అంటూ ఎంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలో రాజమౌళి సినిమాను నాగచైతన్య రిజెక్ట్ చేశాడంటూ వార్త వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.అయితే రాజమౌళి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తెర‌కెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో తన డైరెక్షన్‌లో తెర‌కెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో ఈగ ఒకటి. ఈ సినిమాలో నాని, సమంత జంటగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమాలో హీరోగా నాగచైతన్యను భావించాడట రాజమౌళి. కాగా నాని ఈ సినిమాలో కేవలం అరగంట మాత్రమే కనిపిస్తాడు. ఇక మిగతా సినిమా అంతా కీరోల్‌గా ఈగ పనిచేసింది.ఇలాంటి చిన్న క్యారెక్టర్ లో నాగచైతన్య నటించడం నాగార్జున అసలు ఇష్టపడలేదట. ఇలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తే ఫ్యూచర్లో తనకు స్టార్ హీరోగా మంచి అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో నాగార్జున.. నాగచైతన్యకు ఈ అవకాశం వచ్చిన ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: