టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె శ్రీలీల. పెళ్లిసందడి, ధమాకా చేసిన రెండు సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ పక్క స్టార్స్ తో జత కడుతూ మరోపక్క యువ హీరోలతో రొమాన్స్ చేస్తుంది. 3 సినిమాల అనుభవం ఉన్న వైష్ణవ్ తేజ్ నుంచి 30 సినిమాలు చేసిన మహేష్, పవన్ సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తుంది. రాం తో స్కంద, బాలకృష్ణ భగవంత్ కేసరి, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ గుంటూరు కారం, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేసింది శ్రీలీల.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రకారం క్రేజ్ ఉన్న ఈ టైం లోనే తనకు వచ్చిన ప్రతి ఆఫర్ చేస్తూ వెళ్తుంది శ్రీ లీల. పెద్ద బ్యానర్ అయితే చాలు కథతో సంబంధం లేకుండా సినిమా ఓకే అనేస్తుందట.అయితే లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ కు మాత్రం శ్రీలీల నో చెప్పినట్టు టాక్. పెద్ద ప్రొడక్షన్, స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ని హీరోయిన్ గా అనుకున్నారు. ఫస్ట్ ఆ సినిమా చేస్తానని చెప్పిన శ్రీ లీల ఇప్పుడు నో అనేస్తుందట.శ్రీలీల ఇప్పుడు కొత్తగా ఓ రూల్ పెట్టుకుంట. తాను సోలో హీరోయిన్ గానే ఉండాలి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు చేయదు. అలాగే స్పెషల్, ఐటమ్ సాంగ్స్ చేయదు. తన ఇమేజ్ కు,వయస్సుకు తగ్గ పాత్రే చేస్తుంది. కెరీర్ కు పనికి రాని పాత్రలు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా వద్దని మొహమాటం లేకుండా మేనేజర్ చేత చెప్పిస్తోంట. మరో ప్రక్క డాక్టర్ కోర్స్ చేస్తున్న ఆమె తన చదువు మీద కూడా కాన్సర్టేట్ చేస్తోంది.అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమాని,తమిళ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. కార్తీ సరసన సర్దార్ 2 లో అడిగితే వద్దని చెప్పిందిట. అందుకు కారణం తాను లీడింగ్ లేడీస్ లో ఒకరుగా ఉండటం ఇష్టం లేక అని తెలిసింది. తెలుగులో కూడా ఇద్దరు స్టార్ హీరో సినిమాలకు నో చెప్పిందనే వార్త స్ప్రెడ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: